EX Gratia To Geetanjali Family: గీతాంజలి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా

0
12

గుంటూరు జిల్లాలో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాధ్యులను వదిలిపెట్టవద్దని అధికారులను ఆదేశించారు. ఆమె కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదన్నారు.

ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికారులు గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ తో ఆమె మాట్లాడిన మాటలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయింది. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కు దిగారు. దానిని భరించలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం గీతాంజలి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ చెబుతున్నారు. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని గీతాంజలి భర్త డిమాండ్ చేశారు.

మరో వైపు ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్యమాటల యుద్ధం నడుస్తోంది. గీతాంజలి మరణంపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఆమెను రైలు ఢీకొట్టిన రోజు ఏం జరిగిందనేదానిపై ఆరాదీస్తున్నారు. ఆస్పత్రిలో ట్రీట్మెంట్, ఆ తర్వాత పరిణామాలపై దర్యాప్తు చేస్తున్నారు.