Aroori Ramesh Joined Today Bjp: ఇవాళ బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్!

0
13

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షాను ఆరూరి రమేష్ కలిశారు. బీజేపీ నుంచి వరంగల్‍ ఎంపీ క్యాండిడేట్​గా ఆరూరి రమేశ్​కు టికెట్ పై హామీ లభించినట్లు ప్రచారం జరగుతుంది.

వారం కిందటే ఆరూరి పార్టీ మారాల్సింది .కానీ.. కేసీఆర్, కేటీఆర్ సూచన మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య బుజ్జగించే ప్రయత్నాలు చేయగా వెనకడుగు వేశారు. అయితే మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసినా అరూరి రమేశ్ లిఫ్ట్ చేయడం లేదని తెలిసింది. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా ఎవరికి వారు కాంగ్రెస్ బాట పడుతున్నారు.తాజాగా అరూరి రమేశ్ లాంటి కీలక నేత కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరనుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నట్లు తెలుస్తోంది.

2014, 2018 ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యే గా గెలిచిన ఆరూరి రమేశ్‍ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ అభ్యర్థి కేఆర్‍ నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్​ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన ఎస్సీ నేతగా రమేశ్​కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్​ వరంగల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఓటమి తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడుతుండటంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.