TG పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్ కు కేంద్రం ఆమోదం

0
19

తెలంగాణలో కొత్త వెహికల్స్ ఇక నుంచి టీజీ పేరుతో రిజిస్ర్టేషన్ కానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న టీఎస్ పేరును టీజీగా మార్చాలని రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఫిబ్రవరి 6న ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపగా అధికారులు పరిశీలించి టీజీగా మార్చేందుకు అనుమతి ఇచ్చారు. సాఫ్ట్ వేర్ లో కొద్దిగా మార్పులు చేస్తే సరిపోతుందని, కేంద్ర గెజిట్ కు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు నుంచి నోటిఫికేషన్ రాగానే..కొత్త వెహికల్స్ రిజిస్ర్టేషన్ కు టీజీ పేరుతో చేస్తామని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్రం ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీంతో కేంద్రం కొన్ని మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు.