Hyderabad Liberation Day Official ;Central Government: అధికారికంగా హైదారాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం కీలక నిర్ణయం

0
14

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా హైదారాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ.. హైదరాబాద్ ప్రాంతం నిజాం ఆధీనంలో ఉండిపోయింది. అప్పటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో చేపట్టి 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనలోని హైదరాబాద్‌‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసింది.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత వరకు హైదరాబాద్‌ ప్రాంతం నిజాం పాలనలో ఉంది. ఆపరేషన్‌ పోలో పేరుతో నిర్వహించిన పోలీసు చర్య అనంతరం 1948 సెప్టెంబరు 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. ఈ ప్రాంత ప్రజలు సెప్టెంబరు 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

హైదరాబాద్‌ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన వారికి గుర్తుగా, నేటి యువతలో దేశభక్తి నింపడానికి భారత ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 17ను హైదరాబాద్‌ విమోచన (లిబరేషన్‌) దినంగా నిర్వహించాలని నిర్ణయించింది అని హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.