Musheer Khan breaks Sachin Tendulkar’s 29-year old record in Ranji Trophy final: 19 ఏళ్లకే సచిన్ రికార్డ్ బ్రేక్.. ఎవరీ ముషీర్ ఖాన్.?

0
20

టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో సత్తా చాటాడు. ఈ సెంచరీతో ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులే చేసి విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో సత్తా చాటాడు. క్రీజ్ లో ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసి 326 బంతుల్లో 10 ఫోర్లతో 136 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ 21 ఏళ్లకు ఈ ఘనత సాధిస్తే ముషీర్ ఖాన్ కేవలం 19 ఏళ్లకే ఈ ఘనత అందుకున్నాడు.

ముషీర్ ఖాన్ సెంచరీతో రంజీల్లో ముంబై విజయం దిశగా దూసుకెళ్తుంది. సర్ఫరాజ్ ఖాన్ కు తోడు సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానే (73), శ్రేయాస్ అయ్యర్ (95) రాణించడంతో విదర్భ ముందు 538 పరుగుల భాత్రి లక్ష్యాన్ని నిర్ధేశించింది. లక్ష్య ఛేదనలో విదర్భ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఈ మ్యాచ్ లో విదర్భ గెలిస్తే కొత్త చరిత్ర సృష్టించినట్టే