సుఖూకు సుఖం లేకుండా చేస్తున్న రెబల్స్..మరో షాకింగ్ అప్ డేట్

0
16

మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు రెబల్ ఎమ్మెల్యే రాణా. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. దీంతో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఆ ఆరుగురిపై గురువారం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ రీసెంట్ గా వ్యాఖ్యానించారు.సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజీందర్ రాణా మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఫైరయ్యారు.

“మేం కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచే మరో 9 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ సర్కారు కాదు, సుఖూ మిత్రుల సర్కారు” అని చెప్పారు రాణా. హిమాచల్ ప్రదేశ్ ప్రజల గౌరవాన్ని నిలబెట్టడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామనీ.. హిమాచల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులెవరూ రాష్ట్రం లో లేరా.. బయటి వ్యక్తి అయిన అభిషేక్ మనుసింఘ్వీని ఇక్కడ రాజ్యసభ అభ్యర్థిగా ఎందుకు బరిలో దించారని ప్రశ్నించారు. దాన్ని వ్యతిరేకిస్తూ తామ బీజేపీ అభ్యర్థికి ఓటేశామని రాణా చెప్పారు.