Megastar Chiranjeevi Apple: లోక్ సభ ఎన్నికలు..ఓటర్లకు మెగాస్టార్ సందేశం

0
18

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తప్పకుండా అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మన దేశ 18 వ లోక్ సభ ఎలక్షన్లు త్వరలో జరగబోతున్నాయని..18 సంవత్సరాల వయస్సు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు – మనరాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి..తప్పనిసరిగా ఓటు వేయండంటూ సూచించారు . ఇటీవలే చిరంజీవి దేశ అత్యున్నత రెండో పురస్కారం పద్మవిభూషన్ అందుకున్న సంగతి తెలిసిందే..

కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం దేశంలో ఈ సారి ఓటర్ల సంఖ్య 96 కోట్లకు చేరింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 5 కోట్ల ఓట్లు పెరిగింది. మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. అలాగే మొత్తం ఓటర్లలో దివ్యాంగులు 18లక్షల మంది ఉన్నారు.

ఏపీ ఫైనల్ ఓటర్ల లిస్టు

మొత్తం ఓటర్లు: 4 కోట్ల 8 లక్షల7 వేల 256
పురుషులు: 2 కోట్ల 9 వేల 275
మహిళలు: 2 కోట్ల 7 లక్షల 37 వేల 65
సర్వీస్ ఓటర్లు : 67 వేల 434
థర్డ్ జెండర్ ఓటర్లు: 34 వేల 82