Ycp Final List: ఈ నెల 16న వైసీపీ ఫైనల్ లిస్ట్.!

0
23

ఈ నెల 16న సీఎం జగన్ ఇడుపుల పాయకు వెళ్లనున్నారు.అదే రోజు వైసీపీ తుది జాబితా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్‌ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జిలను నియమించింది.

అదే రోజు ఇచ్ఛాపురం నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్‌, నెల్లూరు రూరల్‌లో ఆయన ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఇలా రోజుకు రెండు లేదంటే మూడు బహిరంగ సభలు, రోడ్ షోలో ఆయన పాల్గొనేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు సమాచారం. రెండుమూడు రో జుల్లో సీఎం జగన్‌ పాల్గొనబోయే ఎన్నికల ప్రచారం షెడ్యూల్ క్లారిటీ వస్తుంది.

వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధం అయ్యిందనే తెలుస్తోంది. గత ఎన్నికల్లో నవరత్నాలు ప్రకటించిన జగన్.. ఈ ఎన్నికల కోసం ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుందా? అని ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ప్రకటించింది. అలాగే త్వరలో ఉమ్మడి మేనిఫేస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.