BRS: బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు..!

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ధాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకుల‌పై గురువారం కేసు నమోదైంది. నిన్న ఖిలావరంగల్‌లో కాకతీయ కళాతోరణం దగ్గర.. బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోటలోకి ప్రవేశించడంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.