పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: మేనల్లుడి పెళ్లి వేడుకల్లో సంప్రాదయ నృత్యం చేస్తూ ఒక్క సారిగా గుండెపోటు రావడంతో పెళ్లి కొడుకు మేనమామ మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల రాజస్థాన్నలో మేనల్లుడి పెళ్లిలో మామ కమలేష్ సంప్రదాయబద్ధంగా తలపై కుండ పెట్టుకుని డీజే పాటలకు హుషారుగా మట్కా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే సడెన్‌గా గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. వెంటనే ఆయనను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించడం.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.