TS News: పాఠశాల ఎదుట ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన.. ఎందుకోసమో చూడండి…

0
17

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. లక్షల రూపాయాల ఫీజులు వసూలు చేస్తూ తల్లిందండ్రుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. చదువు చెప్పాల్సిన అధ్యాపకులు.. ఏకంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్సుల మాటున నయా దందాకు తెర లేపారు. ఈ క్రమంలో నాగోల్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో నివాసం ఉండే ధర్మారెడ్డి తన కుమారుడిని సమీపంలోని అక్షర టెక్నో స్కూల్ చదివించాడు. అయితే, ఈ సంవత్సరం విపరీతంగా ఫీజులు పెంచడంతో ధర్మారెడ్డి తన కుమారుడిని వేరు పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతడు అక్షర టెక్నో స్కూల్‌కు వెళ్లి టీసీ, బోనఫైడ్ అడిగాడు. ఫీజు మొత్తం క్లియర్ చేసినా పాఠశాల యాజమాన్యం టీసీ, బోనఫైడ్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చేసేదేమి లేక ధర్మారెడ్డి పాఠశాల ఎదుట అర్ధ నగ్నంగా నిరసనకు దిగాడు. వెంటనే తన కొడుకుకు టీసీ, బోనఫైడ్ ఇవ్వాలని స్కూల్‌ యాజమన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త విపరీతంగా వైర్ అవుతోంది.