Actor Ali : అలీకి సీటు కన్ఫర్మ్.. పోటీచేసేది అక్కడి నుంచే.?

0
17

ఏపీ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే 9 మంది లిస్టులు రిలీజ్ చేసిన జగన్ మరో లిస్టు రెడీ చేస్తున్నారంట. అయితే ఈ లిస్టులో ఈ సారి కామోడియన్ అలీకి ఎంపీ సీటు ఖాయమని టాక్ వినిపిస్తోంది. అలీకి నంద్యాల ఎంపీ సీటు దక్కొచ్చని ప్రచారం వినిపిస్తోంది. రెండు మూడు రోజుల్లో జగన్ అలీ పేరును ప్రకటిస్తారని సమాచారం. నంద్యాల ప్రాంతంలో ముస్లిం జనాభ ఎక్కువ ఉండటమే అలీని నంద్యాల బరిలో దింపటానికి గల కారణం అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా వ్యవహరిస్తున్న అలీని వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి బరిలో దింపాలని జగన్ డిసైడ్ అయ్యాడట. 2019 ఎన్నికల్లోనే అలీ పోటీ చేయాలని ఆశించినప్పటికీ సీటు దక్కలేదు. ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేకపోయిన జగన్ సలహాదారుడిగా నియమించారు.
అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించిన జగన్ టీడీపీ, జనసేన కూటమికి చెక్ పెట్టే విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నంద్యాల పార్లమెంట్ బరిలో అలీని దింపాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.