AP POLITICS: ముద్రగడకి రెడ్డి కాపు అని పేరు పెడుతున్నాను- పృథ్వీరాజ్

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ముద్రగడ పద్మనాభానికి సిగ్గు లేదు.. అతనికి రెడ్డి కావుగా పేరు పెడుతున్నాట్లు తెలిపారు సినీనటుడు పృథ్వీరాజ్. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీ ప్రచారంలో జోరును పెంచుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన కూటమి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులుకు మద్దతుగా.. సినీనటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను మూడు రోజులుగా పిఠాపురంలోనే ఉన్న కాని ముద్రగడ ఎక్కడ కనబడలేదని.. బహుశా గుడి మెట్ల దగ్గర అడుక్కొని ఉంటున్నాడేమో అని పృథ్వీరాజ్ అన్నారు. బటన్ రెడ్డి గురించి ముద్రగడకు ఏమి తెలుసని.. 10 సంవత్సరాలు జగన్ తో కాపురం చేసిన తనకి అన్ని తెలుసని అన్నారు. జబర్దస్త్ లో అవకాశాల కోసం తిరిగిన రోజా మంత్రిగా వేల కోట్లు ఎలా సంపాదించిందని.., రోజాని తట్టుకోలేక ఆమె మొగుడు చెన్నైలో ఉంటున్నాడని పృథ్వీరాజ్ మండిపడ్డారు.