Amith Shah Hot Comments: చంద్రబాబుకు మా విలువ తెలిసింది..పొత్తులపై అమిత్ షా సంచలన కామెంట్స్

0
15

ఏపీలో పొత్తులపై ఇండియా టుడే కాంక్లేవ్లో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తుపై కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా గతంలో మోదీని టెర్రరిస్ట్ అని విమర్శించిన చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకున్నారని యాంకర్ ప్రశ్నించగా.. చంద్రబాబును కూటమి నుంచి మేం తొలగించలేదు. ఆయనే వెళ్లిపోయారు. మోదీని టెర్రరిస్ట్ అన్నారో లేదో నాకు తెలియదు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు పరాజయం కట్టబెట్టారు. ఆ తర్వాత అర్థం చేసుకుని తిరిగి మాతో చేరారని షా బదులిచ్చారు.

జగన్తో పొత్తుపై అమిత్ షా

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిచ్చిన జగన్ పొత్తు ఎందుకు పెట్టుకోలేదని దీనికి ఆయన సమాధానమిస్తూ .. బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వలేదు. కొన్నింటికి మాత్రమే ఇచ్చింది. పార్లమెంటులో ఆయా పార్టీలు తమ సొంత సిద్ధాంతాలు. అజెండాలకు తగ్గట్టుగానే బిల్లులకు మద్దతునిస్తాయని తెలిపారు.