రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీతో పాటు టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు ఒక్క అభ్యర్థి పేరునూ ఖరారు చేయలేదు. జాబితాపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఆమె కడప MP అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ 114 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
కడప పార్లమెంట్ బరిలో వైసీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుండి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల సీన్లోకి ఎంటర్ అవ్వటంతో కడప పార్లమెంట్ బరిలో హోరాహోరీ పోటీ ఖాయమని అనిపిస్తోంది. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి జగన్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ వైసీపీని ఓడించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.