TS POLITICS : పెళ్లి కొడుకులా ముస్తాబయి నామినేషన్

0
15

చార్మినార్, హైదరాబాద్ : మెడలో పూలదండ.. ఒంటిపై రాజస్థాన్ తరహాలో వస్త్రాధారణ ధరించి.. ఒంటె పై పెళ్లి కొడుకు అవతారంలో ఊరేగింపుగా మండపానికి వెళ్తున్నట్లుగా రెడీ అయి నామినేషన్ వేయడానికి వెళ్లాడు ఓ యువకుడు. పాతబస్తీ కబూతర్ ఖానకు చెందిన అనిల్ సేన్ హైదరాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలుకు వినూత్నంగా కలెక్టరేట్‎కు బయలుదేరారు. గురువారం నామినేషన్ వేయుటకు వినూత్నంగా రాజస్థాని స్టైల్‌లో వస్త్రాధారణ వేసుకొని ఒంటె పై నామినేషన్ వేయడానికి బయలుదేరాడు. ఇలా ఎక్కడికి వెళ్తున్నారని అయనను పలువురు ప్రశ్నించగా కార్పొరేటర్‎గా, ఎమ్మెల్యేగా, పోటీచేసి ఓడి పోయానని.., ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అనిల్ సేన్ పేర్కొన్నారు.