పొత్తులో భాగంగా బీజేపీ ఎంపీ సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. అరకు-కొత్తపల్లి గీత, రాజమండ్రి-పురందీశ్వరి, నరసాపురం-రఘురామకృష్ణరాజు, తిరుపతి-మునిసుబ్రహ్మణ్యం పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులుగా విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి, అయ్యాజీ, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, సాయిలోకేశ్ పేర్లు కూడా ఫిక్స్ అయినట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది. ఇందులో జనసేన 24 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగనుండగా.. కేంద్రంలో హ్యాట్రికే విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ ఏపీలో 6 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ బీజేపీ రెండో జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో 100కు పైగా పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించింది. కాగా తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో లిస్టులో 7 మందిని ప్రకటించనున్నట్లు టాక్.