CBN: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. ఆ అంశాలపై ప్రధాని మోదీతో భేటీ

0
24

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో పాలనాపరమైన పనులను చక్కబెట్టిన సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రి 5.10కి విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.25కు ఢిల్లీలో దిగనున్నారు. అయితే, రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వివిధ సమస్యలపై ఆయన హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలతో వేరువేరుగా కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు.

అయితే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడ విశేషం. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు, విభజన హామీల అమల అమలుపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ మేరకు ఆయనతో పాటు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి సీఎం వెంట ఢిల్లీకి వెళ్లనున్నారు.