CBN: సన్ గ్లాసెస్ లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్టైలిష్ లుక్

0
9

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కార్యకర్తలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె ‘పెట్టుకోండి సార్’ అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనలేక సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు. ఆ క్షణం ఉత్సాహానికి గురైన ఆమె జై బాబు అంటూ నినదించారు.