పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కాళ్యాణ్కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారు. ఇక సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సోమవారం ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు.