BREAKING : ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

0
42

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం తాడేపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. సరిగ్గా పరీక్షలు పూర్తైన 22 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం, సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 90 శాతం ఉత్తర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలను ఈ https://bieap.apcfss.in/ లింక్‎లో చెక్ చేసుకోవచ్చు.

అలానే ఫలితాల అనంతరం సప్లిమెంటరీ పరీక్షా తేదీలను కూడా ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నది. కాగా, ఫలితాలను తట్టుకోలేక క్షణికావేశంలో ఏమైనా చేసుకునే విద్యార్థులకు తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం మనోధైర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.