AP Politics: ఇప్పటివరకూ వైసీపీ గెలవని అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవే

0
15

ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార వైసీపీ గట్టి ప్లాన్ లో ఉంది. 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇప్పటికే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 2019తో పోలిస్తే ఈసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించారు.

అయితే రాష్ట్రంలోని 20 స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. ఇందులో కుప్పం, హిందూపురం, చీరాల, కొండెపి, పర్చూరు, గుంటూరు 2, గన్నవరం, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, టెక్కలి, ఇచ్చాపురం స్థానాలు ఉన్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరి సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు(D) తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు(D) ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ మూడో జాబితాలోనూ చుక్కెదురైంది. ఆ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. ఇక వీరు ఈ ఎన్నికల బరిలో లేనట్లేనని తెలుస్తోంది. మరో ఇద్దరు నేతలు కోటంరెడ్డి(నెల్లూరుR), రామనారాయణ రెడ్డి(ఆత్మకూరు)కి టీడీపీ సీట్లు కేటాయించింది.