AP Politics: జనసేనకు ప్రచారం చేస్తానని చెప్పలేదు : అనసూయ

0
12

జనసేనకు తాను ప్రచారం చేస్తానని చెప్పినట్లు వస్తున్న వార్తలపై నటి అనసూయ స్పందించారు. ‘నేను ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారు. జనసేన పార్టీకి నా అంతట నేను ప్రచారం చేస్తానని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడనేది నా ఉద్దేశం. ఆయన అడిగితే మద్దతు ఇస్తానని చెప్పా. అంతే కానీ ప్రచారం చేస్తానని చెప్పలేదు. మంచి లీడర్లు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తా. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి” అంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి, నాగబాబు, రోజా అడగడంతో.. నేను పవన్ కళ్యాణ్ , నాగబాబు పిలిస్తే కచ్చితంగా ప్రచారం చేస్తాను, అలాగే రోజా పిలిచినా ప్రచారం చేస్తాను. నేను పార్టీలను చూడను, వ్యక్తులని చూస్తాను అని అనసూయ చెప్పుకొచ్చారు

ఆ విషయం పక్కన పెడితే యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ కొత్త కొత్త క్యారెక్టర్స్ తో మెప్పిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం అనసూయ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. తన ఫొటోలతోనో, తన కామెంట్స్, తన ట్వీట్స్ తో అనసూయ వైరల్ అవుతూ ఉంటుంది.