AP Politics: జనసేన అధినేత పవన్ కు అస్వస్థత

0
10

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. 2 రోజులుగా జ్వరం, దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. పిఠాపురం సభ తర్వాత ఆయన నీరసపడినట్లు సమాచారం. దీంతో ఆయన హెలికాప్టర్‌లో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. అటు త్వరలోనే పవన్ తదుపరి పర్యటన షెడ్యూల్ ఖరారు చేసేందుకు జనసైనికులు కసరత్తు చేస్తున్నారు.

వైసీపీ కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నిన్న పిఠాపురంలో కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసమే తాను తగ్గానని తెలిపారు. జనసేన-టీడీపీ కలిసి ముందుకు వెళ్తేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలమని అన్నారు. నాయకుల మధ్య ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలని.. పిఠాపురంలో తన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు.

పిఠాపురంలో తన పోటీకి మద్దతిచ్చిన TDP నేత వర్మను జనసేన అధినేత పవన్ ప్రశంసించారు. ‘చంద్రబాబు గీసిన గీత దాటను అని వర్మ చెప్పడం నాకు ఆనందం కలిగించింది. నా గెలుపునకు బాధ్యత తీసుకున్న ఆయనకు.. నేను గెలిచిన తర్వాత మర్యాద, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటా. ఒంటెద్దు పోకడలకు పోను. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై 3 పార్టీల నాయకులం ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని పవన్ వెల్లడించారు.