ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైజాగ్ జిల్లా కాంగ్రెస్ నేతలు తొలి ఎన్నికల సమావేశానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ తృష్ణా మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉక్కు డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ బహిరంగ సభలో జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల, తెలంగాణ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏపీ మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశముంది.
రేవంత్ రెడ్డి రాకతో పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతుందని డీసీసీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు తెలిపారు. ఆయన స్పీచ్, నిబద్ధత పార్టీ కార్యకర్తలను ప్రభావితం చేస్తాయన్నారు.