AP politics: కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి?

0
10

వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డి(కమలాపురం మాజీ ఎమ్మెల్యే)ని బరిలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది. ఆయన పేరుతో కొన్ని రోజులుగా IVRS సర్వే చేస్తోంది. సర్వేలో ఎంపీ అభ్యర్థిగా వీరశివారెడ్డితో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించగా వీరశివారెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

వీరశివారెడ్డికి కడప జిల్లాలో రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. 2014లో పోటీ చేసిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఈసారి విముఖత చూపుతున్నట్లు సమాచారం. కాగా కడప ఎంపీ స్థానంలో టీడీపీ కేవలం ఒక్కసారే(1984లో నారాయణరెడ్డి) గెలిచింది. 1989 నుంచి వైఎస్ కుటుంబసభ్యులే విజయం సాధిస్తున్నారు.

క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం నియోజకవర్గానికి చెందిన వీర‌శివారెడ్డి.. టీడీపీతోనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా క‌మ‌లాపురం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓడిపోయారు.. 2004లో టీడీపీ అభ్యర్థిగా మ‌ళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు.

అయితే 2009 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలపొందారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయ‌లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లికిన ఆయ‌న ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీలో చేరిపోయారు.