AP Politics: స్వరూపానంద విన్నపం.. జగన్ పక్కన పెట్టేశారా..?

0
33

ఎన్నికల కోడ్ ఏపీలో కొన్ని నిర్ణయాలకు బ్రేక్ వేసింది. ఏపీ సీఎం జగన్ స్వరూపానంద కోరికను మన్నించలేకపోయారు. ఆయనపై కోపం వచ్చిందా లేకపోతే.. అధికారులు ఇరుక్కుపోతామని భయపడ్డారా అన్నది తెలియదు కానీ.. స్వరూపానంద కోరికను మాత్రం తీర్చలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పదిహేను ఎకరాలను భీమిలి సమీపంలో శారదాపీఠానికి వైసీపీ ప్రభుత్వం రాసిచ్చింది. ఆ భూములను ఆధ్యాత్మిక ప్రచారానికి మాత్రమే వాడుకోవాలని తెలిపింది. అయితే శారదాపీఠం స్వరూపానంద… తాము చాలా చోట్ల ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తున్నామని… భిమీలి భూముల్లో మాత్రం వ్యాపారం చేస్తామని అనుమతి ఇవ్వాలని దరఖాస్తు పెట్టింది. ఈ దరఖాస్తు కాస్త విచిత్రంగా ఉండటంతో… అధికారులు అటూ ఇటూ ఆలోచించి పెండింగ్ లో పెట్టారు.

తీరా ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఇప్పటివరకు కూడా ఆ నిర్ణయం పెండింగ్ లో ఉంది. కోడ్ వచ్చిన తర్వాత తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన భూమిని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడుకోవాలని స్పష్టం చేశారు.