BREAKING: పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

0
45

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్ : ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇవాళ విజయవాడలో టెన్త్ రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు.అఫిషీయల్ వెబ్‎సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని తెలిపారు.ఏదైనా సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఏడాది మొత్తం 6.18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.

బాలురు 84.32, బాలికలది 89.17 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. టెన్త్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. 96.37 శాతం పాస్ పర్సంటేజ్‌తో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలువగా.. 62 శాతం ఉత్తీర్ణతతో కర్నూల్ జిల్లా చివరి స్థానంలో నిలించింది. కాగా, మార్చి 18 నుండి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, అకడమిక్ ఇయర్ పూర్తి కాకముందే అధికారులు పదవ తరగతి ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.