AP TTD: తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

0
14

విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట లైన్లలో వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 60,958 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్కరించుకుని ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ.

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ. అందులో భాగంగా ఉగాదికి ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తోంది టీటీడీ. ఏప్రిల్ 2న 11 గంటల తర్వాత నుంచి భక్తుల్ని దర్శనం కోసం అనుమతిస్తుంది టీటీడీ.