Delhi Politics: ఢిల్లీ నెక్ట్స్ సీఎం రేసులో ఉన్నది వీళ్లే..

0
20

మద్యం పాలసీ కేసులో అరెస్టయినప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారని ఆప్ స్పష్టం చేసింది. అయితే ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే లేదా ఆయనకు శిక్ష పడితే నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిణి అయిన ఆయన భార్య సునీత, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లలో ఒకరికి అవకాశం దక్కొచ్చని చర్చ జరుగుతోంది. అలాగే పార్టీ పగ్గాలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు అప్పగించే అవకాశముందని చెబుతున్నారు.

మరో వైపు కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ నేతలు మండిపడుతున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ చద్దా ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని ప్రకటించనప్పటికీ.. ఇండియాలో పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంలను లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం చూడలేదు. బలమైన ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ట్వీట్ చేశారు.

అయితే కే జ్రీవాల్ అరెస్ట్ తో సీఎంను అరెస్ట్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లను మాత్రమే పదవిలో ఉండగా అరెస్ట్ చేయరాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరని పేర్కొన్నారు. పీఎం,సీఎంలను చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చంటున్నారు.