Delhi Liquor Scam: ఇవాళ్టితో ముగిసిన కేజ్రీవాల్ కస్టడీ.. కోర్టు ముందుకు కేజ్రీవాల్

0
20

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ 10 రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఈడీ అధికారులు ఇవాళ కేజ్రీవాల్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్‌ను మరో సారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు పంపుతారా లేక ఈడీ తన కస్టడీకి తీసుకుంటుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ మార్చి 21 న ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రోజున సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా మార్చి 28 వరకు కస్టడీకి అనుమతించింది కోర్టు. అనంతరం మరోసారి కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. ఢిల్లీ సీఎం నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని కోర్టుకు నివేదించింది. నిందితుడు విచారణకు సహకరించడం లేదని, అందువల్ల కస్టడీని పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం కస్టడీని ఏప్రిల్ 1వ తేదీ వరకు పొడిగించింది. మరో వైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 3న విచారణ జరగనుంది.