పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్:కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఆషాఢ మాసం కావడం.., అందులోనూ మంచిరోజు కూడా లేకపోవడంతో ఈ విషయంపై మరోసారి భేటీ కావాలంటూ కాంగ్రెస్ పెద్దలు సీఎం రేవంత్‌రెడ్డిని సూచించారు. మంత్రి పదవుల కోసం ఇప్పటికే చాలామంది ఆశావహులు లైన్లో ఉండటంతో ఎన్నిక ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. అదేవిధంగా కొన్ని పదవుల్లో నేతలు కాంప్రమైజ్ కాకపోవడంతో కేబినెట్ విస్తరణ తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం రాత్రి మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్, తదితరులు భేటీలో పాల్గొన్నారు. అయితే, రానున్న శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే, పీసీసీ చీఫ్‌గా పోటీలో మాజీ ఎంపీ మధుయాష్కీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.