Ashwin Badluck: అశ్విన్ బ్యాడ్లక్..వందో టెస్టులో చెత్త రికార్డ్

0
22

ధర్మశాల టెస్టుతో తన కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత స్పిన్నర్ అశ్విన్ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో అశ్విన్ డకౌట్ అయ్యాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టిన అశ్విన్ బ్యాటింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కెరీర్‌లో వందో టెస్టు అంటే ఏ ఆటగాడికైనా ప్రత్యేకమే. అలాంటిది అశ్విన్‌ ఐదు బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ అవ్వడంతో ఓ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

వంతో టెస్టులో డకౌట్‌ అయిన క్రికెటర్లు

రవిచంద్రన్ అశ్విన్: ఇంగ్లాండ్‌పై (2024)
చెతేశ్వర్ పుజారా: ఆస్ట్రేలియాపై (2023)
అలిస్టర్ కుక్: ఆస్ట్రేలియాపై (2013)
బ్రెండన్ మెకల్లమ్: ఆస్ట్రేలియాపై (2016)
స్టీఫెన్ ఫ్లెమింగ్: సౌతాఫ్రికాపై (2006)
అలన్ బోర్డర్: వెస్టిండీస్‌పై (1991)
దిలీప్ వెంగ్‌సర్కార్: న్యూజిలాండ్‌పై (1988)