భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ అరుదైన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ పై టీమ్ ఇండియా టాప్-5 బ్యాటర్లు అర్ధసెంచరీలు సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ (103), శుభ్మన్ గిల్ (110). యశస్వీ జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56), దేవదత్ పడిక్కల్ (62) 50కిపైగా స్కోర్లు నమోదు చేశారు.
ధర్మశాల టెస్టులో భారత్ టెస్ట్ మ్యాచ్ ను పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకుంది. తొలి రోజు బౌలింగ్, రెండో రోజు బ్యాటింగ్ లో సత్తా చాటడంతో ఈ మ్యాచ్ పై పట్టు బిగిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. క్రీజ్ లో కుల్దీప్ యాదవ్(27), జస్ప్రీత్ బుమ్రా(19) ఉన్నారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం 255 పరుగులు ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు ఉండడంతో మరో 30 నుంచి 40 పరుగులు జోడించే అవకాశం ఉంది.