MP Purandeshwari: కోట్లాది హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి- ఎంపీ పురందేశ్వరి

0
29

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: హిందువులంతా అసత్యమాడుతూ హింసకు పాల్పడుతున్నారని పార్లమెంట్‌లో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలో పలువరు బీజేపీ నేతలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. హింసకు దూరంగా ఉంటూ శాంతియుత వాతావరణంలో జీవించే హిందవులపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఈ క్రమంలోనే రాహుల్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. 1975లో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పందంగా ఉందని అన్నారు. వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంట్‌లో వేదాలు వల్లించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని చురకలంటించారు. హిందుల పట్ల చులకనగా మాట్లాడిన రాహుల్ గాంధీ వెంటనే భారతదేశానికి, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ పురందేశ్వరి డిమాండ్ చేశారు.