జనసేన అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘దశాబ్దం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను. నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదు. సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం శ్రమించినా గుర్తింపు లేదు. మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది. ఇప్పుడు కావలసింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్‌కు ‘గతం చేసిన గాయం, ఓటమి నేర్పిన పాఠం నుంచి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం.. అని రాసి ఉన్న పవన్ కల్యాణ్ ఫోటోను జత చేశారు. జనసేనకు 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు అయితేనే గౌరవప్రదం అంటూ గతంలోనే బొలిశెట్టి సత్యనారాయణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 40కి తగ్గకుండా సీట్లు ఇవ్వడమే కాకుండా పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలంటూ గతంలో బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు