TG Politics: రేపటి నుంచి జిల్లాల్లో కేసీఆర్ పర్యటన

0
12

రేపటి నుంచి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

వాస్తవానికి ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ పర్యటన ఉండగా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కేకే, మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీ మారడం, నాయకుల్లో ఉన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో షెడ్యూల్‌‌ను కేసీఆర్ ముందుకు జరుపుకున్నట్లు తెలుస్తోంది.కడియం, కేకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమైన సంగతి తెలిసిందే..

మరోవైపు తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటాయి.‌ పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటపొలాలను చూసి దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కొందరు బావుల్లో పూడిక తీస్తుండగా మరికొందరు ట్యాంకర్ ల ద్వారా పంటపొలాలకు నీటి సప్లై చేస్తున్నారు.‌ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.