TG Politics: హైదరాబాద్ BRS ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ప్రస్థానం

0
24

హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బిజినెస్ మ్యాన్ హైందవీ కాలేజీల ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 56 ఏళ్ల వయసు గల ఆయన గోషామహల్లో ఉంటున్నారు. బీకామ్ చదివిన శ్రీనివాస్ 1989 లో NSUI ఓయూ ఇన్ఛార్జి. NSUI నగర, రాష్ట్ర, జాతీయ కార్య దర్శిగా, 2006-2011 వరకు ఉమ్మడి AP గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. 2015 నుంచి BRSలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన 2018, 2023లో గోషామహల్ టికెట్ ఆశించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ తరఫున మాధవీలత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించడంతో బీఆర్ఎస్ 17 లోక్ సభస్థానాలకు మొత్తం అభ్యర్థులను ప్రకటించింది.

17 లోక్ సభ స్థానాల్లో మూడు ఎస్సీ,రెండు ఎస్టీ స్థానాలు, మిగిలిన 12 స్థానాల్లో సగం స్థానాలు అంటే ఆరింటిని బీసీలకు కేటాయించారు కేసీఆర్. చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఇందులో ఇద్దరు మున్నూరు కాపు, ఇద్దరు యాదవ, ఒకరు ముదిరాజ్, ఒకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.

మొత్తం 17 మంది అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఉండగా ఏడుగురు కొత్త వాళ్లకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఈ 17 మంది అభ్యర్థుల్లో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి, మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఉన్నారు.