బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పై కుటుంబ పార్టీగా ముద్ర పడటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత తప్ప ఎన్నికల ప్రచారంలో మరే BRS నేత కనిపించలేదని, ఇది ప్రజల్లో, కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమయిందని కేకే వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత BRS మూడో స్థానానికే పరిమితమవుతుందని కేకే జోష్యం చెప్పారు. తెలంగాణలో బూతులు మాట్లాడే సంస్కృతి BRS తోనే మొదలయిందని కేకే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై BRS నేతలు అభ్యంతరకరమైన భాష మాట్లాడటం దారుణమని కేకే అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై తెలంగాణ ప్రజలు సానుకూలంగానే ఉన్నారని కేకే చెప్పారు.పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ అగ్రనేత కేకే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారాయి.