LIQUOR CASE : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్

0
16

వెబ్‎డెస్క్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఈడీ.. తమ జ్యుడీషియల్ కస్టడీలో ప్రస్తుతం తీహార్ జైలులో కవితను ఉంచారు. అయితే గురువారం కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. కవితను 10 రోజుల కస్టడీకి కోరే యోచనలో సీబీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్‌పై విచారణ జరగనుంది.