పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: కొత్త చట్టాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత లోక్‌సభలో కొత్త చట్టలపై 9.30 గంటల పాటు, రాజ్యసభలో 6 గంటల పాటు చర్చ జరిగిందని గుర్తు చేశారు. బ్రిటీష్ వారు అమల్లోకి తీసుకొచ్చిన చట్టాలపై కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఎందకో అని సెటైర్లు వేశారు. ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కూడా అభిప్రాయం తెలుసుకునేందుకు ఎంపీలకు లేఖలు రాశామని వెల్లడించారు. తాము తీసుకొచ్చిన కొత్త చట్టాలతో భాధితులకు సత్వర న్యాయం జరుగుతోందని, విచారణ కూడా వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుదని అన్నారు. అదేవిధంగా విచారణ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తవుతుందని తెలిపారు. అయినా, తాము కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అమిత్ షా అన్నారు.