ఇవాళ రాజేంద్ర నగర్లో రాష్ర్ట హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు జడ్జిలు, అడ్వకేట్లు ఎత్తున హాజరుకానున్నారు.
రాష్ర్ట ప్రభుత్వం హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఇటీవల 100 ఎకరాల ల్యాండ్ ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శంకుస్థాపన కార్యక్రామానికి వీలుగా గత కొద్ది రోజులుగా ల్యాండ్ లో ఉన్న చెట్లను తొలిగిస్తూ చదును చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖలు హాజరు కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎవరూ హాజరుకావడం లేదు.
శంకుస్థాపన నేపథ్యంలో ట్రాఫిక్ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్డైవర్షన్స్ ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్సీపీ జోయెల్డేవిస్ తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
-శంషాబాద్, మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఆరంఘర్క్రాస్రోడ్వద్ద జూపార్క్, బహదూర్ పురా వైపు వెళ్లాలి. చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు.
-కాటేదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలు దుర్గానగర్క్రాస్ రోడ్డులో నుంచి ఆరాంఘర్, బహదూర్పురా వైపు వెళ్లాలి.
-చాంద్రాయణగుట్ట వైపు అనుమతించరు. శంషాబాద్ వైపు నుంచి ఓల్డ్ కర్నూల్ రోడ్డులోకి వచ్చే వాహనాలు కాటేదాన్, దుర్గానగర్, ఆరాంఘర్, జూపార్క్, మెహిదీపట్నం వైపు వెళ్లాలి. ఆరాంఘర్ జంక్షన్ వైపు