Clash Between TDP and YCP Activists: నరసరావుపేటలో టీడీపీ, వైసీపీ ఫైటింగ్.. ఏం జరిగిందంటే..?

0
10

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ సీరియస్ ఘర్షణలు వెలుగుచూస్తున్నాయి. దీంతో పోలీసులు అలర్టయ్యారు. లీడర్లు రోడ్డెక్కుతున్నారంటేనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో పవర్ కోసం వైసీపీ, టీడీపీ మధ్య భారీస్థాయి యుద్ధమే జరగబోతున్న ఈ తరుణంలో పరిస్తితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు తమవంతు చర్యలు తీసుకుంటున్నారు.

నరసరావుపేట పట్టణంలో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు, పార్టీ సభ్యులు వార్డులను సందర్శించినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, సీసాలు విసురుకున్నారు. గాయపడిన సభ్యులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. త్వరలోనే కేసు నమోదు చేసి మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ఓ అధికారి తెలిపారు. రెండు వర్గాలు తారసపడినప్పుడు రాళ్లు రువ్వేవరకు గొడవలు ముదరకముందే.. ఇరు వర్గాలను సర్దుబాటు చేయాలని పై అధికారులనుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.