CM Revanth Reddy: రేవంత్ మాస్టర్ ప్లాన్.. అడవుల్లో బయో డైవర్సిటీ ఎకోటూరిజం ప్రాజెక్టులు

0
27

తెలంగాణను పర్యాటకంగా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్యమున్న ప్రాంతాలను గుర్తించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులకు శుక్రవారం దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలను ఆదేశించారు సీఎం.

తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అధికారులను ఆదేశించారు. అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే ప్రాంతాలన్నింటినీ గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలని అన్నారు.

తెలంగాణలో అడవులు, ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాలకు కొదువేలేదు. ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.