CBN: గురువు గారికి శుభాకాంక్షలు- సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

0
18

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మ‌ధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజ‌యం సాధించిన నారా చంద్ర‌బాబుకు ఫోన్ లో సీఎం రేవంత్ శుభాకాంక్ష‌లు తెలిపారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు కొన‌సాగాల‌ని.. విభ‌జ‌న అంశాల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబును రేవంత్ రెడ్డి కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ 135, జ‌న‌సేన 21, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేప‌థ్యంలో 12వ తేదీన చంద్ర‌బాబు నాయుడు ఏపీ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అనుమ‌తిస్తే చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్తాన‌ని రేవంత్ నిన్న ప్రెస్‌మీట్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.