CM Revanth Reddy launches ‘T- Safe’ to make travel safe for women: మహిళల రక్షణాత్మక ప్రయాణం కోసం T-SAFE

0
15

మహిళా సంక్షేమంపై పెద్దఎత్తున దృష్టిపెట్టింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల భద్రత కోసం స్పెషల్ అప్లికేషన్ ను తీసుకొచ్చింది. వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే T-SAFE ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సచివాలయంలో ప్రారంభించారు.

మహిళలు తమ ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ యాప్ లో సంప్రదించి షీ టీమ్స్ ను సహాయం పొందవచ్చు. T-SAFE పై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం పోస్టర్ ను రూపొందించింది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. అనేక ప్రత్యేక ఫీచర్లతో T-SAFE యాప్‌ రూపొందించినట్టు పోలీసులు వివరించారు. ప్రయాణాల్లో ఇబ్బంది అనిపిస్తే ఈ యాప్ రన్ చేసి సేఫ్ గా ఇళ్లకు చేరుకోవాలని మహిళలకు సూచిస్తున్నారు పోలీసులు.