CM Revanth Reddy My friend: రేవంత్ నా ఫ్రెండ్.. చివరి వరకు కాంగ్రెస్ తోనే : పటేల్ రమేశ్ రెడ్డి

0
18

తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి ఖండించారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు చిన్ననాటి మిత్రుడని.. ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. ఏ పార్టీలు తనని సంప్రదించలేదని.. ఆ ధైర్యం ఎవరికి లేదన్నారు.

కాగా గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి రమేశ్ రెడ్డికి టికెట్ దక్కలేదు. దీంతో నల్గొండ ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. కానీ నల్గొండ ఎంపీ సీటు రఘువీర్ రెడ్డికి ఇచ్చారు. అయితే పటేల్ రమేశ్ టికెట్ కేటాయించకపోటవం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాశంమైంది. ఆయనకు కేబినేట్ స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది.

కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో ప్రస్తుతం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్‌ నుంచి సురేశ్‌ షేట్కర్‌, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ పేర్లు తొలి జాబితాలో ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డిని పేరును ప్రకటించిచ ఆయన పేరును హోల్డ్‌లో పెట్టింది.