CM Revanth: డిప్యూటీ సీఎంకు సీఎం స్పెషల్ విషెస్.

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని సీఎం రేవంత్ తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా భట్టితో నవ్వుతూ దిగిన ప్రత్యేకమైన ఫొటోను సీఎం జత చేశారు.