పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్‌కు ఇన్విటేషన్ అందించారు. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీం భట్టి భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. కాగా, తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఇప్పటికే ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ వేడుకలను కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సోనియాగాంధీని స్పెషల్ గెస్ట్‌గా రావాలని కలిసి ఆహ్వానించారు. సోనియాను ప్రత్యేకంగా సన్మానించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది.