పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, డీఎస్సీ(DSC) అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2, గ్రూప్-1, డీఎస్సీ పరిక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోలనపై కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమంలో స్పందించారు సీఎం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరుద్యోగులకు కొందరు పరీక్షలు వాయిదా వేయమని అంటుంటే.. మరికొందరు పరీక్షలు నిర్వహించాలని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉంది. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బంది ఉంటే.. తమ మంత్రులను కలిసి చర్చించాలని.. నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను తాము ఖచ్చితంగా పరిష్కరిస్తామని సూచించారు.
అయితే, శనివారం జేఎన్టీయో(JNTU)లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గోని.. రాష్ట్రంలోని ఏ పరీక్షలు వాయిదా వేయబోమని.. ఈ పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రానివారు మరో ఉద్యోగం చూసుకుంటారని.., కొంతమంది కావాలనే కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై విద్యార్థులతో దర్నాలు చేపిస్తున్నారని విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు శనివారం రాత్రి హైదరాబాద్లోని అశోక్ నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ.. నినాదాలు చేశారు. దీంతో అశోక్ నగర్ చౌరస్త దద్దరిల్లిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.